
జగ్గయ్యపేట సామినేనిని కలిసిన శ్రీకృష్ణదేవరాయ సేవ సమితి కమిటీ
శ్రీకృష్ణదేవరాయ సేవ సమితి నూతనంగా ఎన్నికైన పట్టణ కమిటీ సభ్యులు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభానును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉదయభాను నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సమితి తరఫున చేపట్టిన, చేపట్టబోయే కార్యక్రమాల గురించి కమిటీ సభ్యులు ఉదయభానుకు వివరించారు.




































