జగ్గయ్యపేటలో కన్యకా పరమేశ్వరికి 108 కలశాలతో అభిషేకం

13చూసినవారు
శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఆదివారం జగ్గయ్యపేట అద్దాల బజార్లోని అమ్మవారి దేవస్థానంలో 108 కలశాలతో అభిషేకం ఘనంగా నిర్వహించారు. పంచామృతాలు, పండ్ల రసాలు, వివిధ సుగంధ ద్రవ్యాలు, ఆవు పాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం శ్రీ చక్రానికి అభిషేకాదులు, అమ్మవారికి కనకాభిషేకం, కుంకుమార్చనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you