జగ్గయ్యపేటలో పలుచని ప్లాస్టిక్ కవర్ల నిషేధం అమలు

3చూసినవారు
జగ్గయ్యపేట మున్సిపల్ పరిధిలో పలుచని పాలిథిన్ కవర్ల వినియోగాన్ని చట్ట ప్రకారం అమలు చేయనున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ రాఘవేంద్ర తెలిపారు. శుక్రవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో, ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని కౌన్సిలర్లు అభిప్రాయపడ్డారు. ఈ మార్పునకు నాంది పలుకుతూ, కౌన్సిల్ హాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బదులుగా గాజు గ్లాసుల్లో నీటిని అందించడం ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్