తుఫాన్ బాధితులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నిత్యావసర సరుకుల పంపిణీ

1460చూసినవారు
తుఫాన్ బాధితులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నిత్యావసర సరుకుల పంపిణీ
మొంథా తుఫానుతో నష్టపోయిన జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పేద కుటుంబాలకు ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అండగా నిలిచారు. కూటమి ప్రభుత్వం తరఫున పంపిణీ చేసిన నిత్యావసర సరుకులను ఆయన స్వయంగా లబ్ధిదారులకు శుక్రవారం అందజేశారు. తుఫాన్ ప్రభావంతో ఎవరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోందని, అవసరమైన ప్రతి సహాయం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్