జగ్గయ్యపేట పట్టణంలో చిల్లకల్లు రోడ్డులో ఇద్దరు మహిళల వద్ద నుంచి నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించగా, చెరువు బజార్కి చెందిన దుర్గా, కుమారీలు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వద్ద గంజాయి బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.