పెనుగంచిప్రోలులోని మోడల్ కాలనీలో పిల్లి వెంకటలక్ష్మి నివాసం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ధాన్యం బస్తాలు, విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే వెంకటలక్ష్మి ప్రస్తుతం నివాసం లేక రోడ్డున పడిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.