పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆదాయానికి అధికారుల గండి..?

2చూసినవారు
పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆదాయానికి కొందరు అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై గండి కొడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మవారి ఆదాయాన్ని దారి మళ్లించి, తక్కువ ధరలకే వేలం దగ్గించుకుంటున్నారని, దీనివల్ల గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం భారీగా తగ్గిందని భక్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు, వ్యాపారులు కలిసి ఆదాయాన్ని మింగేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you