జగ్గయ్య పేట మండలం అనుమంచిపల్లిలో 20 గంటలు గడిచినా విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడలేదు. దీంతో గ్రామస్థులు కరెంట్, తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంట చేసుకోవడానికి కూడా నీరు లేకపోవడంతో, పక్క రాష్ట్రమైన తెలంగాణలోని సూర్యపేట జిల్లా నల్లగొండ గ్రామం నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి తక్షణమే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, నీటి సమస్యను తీర్చాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.