తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 4 ఇసుక లారీ యజమానులు, ఏడుగురు డ్రైవర్లపై చిల్లకల్లు పోలీసులు వాల్టా చట్టం కింద కేసు నమోదు చేశారు. జగ్గయ్యపేట గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నారు. నందిగామ సమీపంలోని అంబారుపేట వద్ద ఇసుక డంప్ ఏర్పాటు చేసుకొని తెలంగాణకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.