జగ్గయ్యపేట మండలం కౌతవారీ అగ్రహారంలో ఇంటి సర్వీస్ వైరు మారుస్తుండగా ప్రైవేటు ఎలక్ట్రీషియన్ బోద హరికృష్ణ కరెంట్ షాక్‌కు గురై స్తంభంపై నుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతనికి గాయాలై శరీరం కాలింది. వెంటనే జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి, మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు ఈ సంఘటన జరిగింది.