జగ్గయ్యపేట: పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

0చూసినవారు
జగ్గయ్యపేట: పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే
గురువారం, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని నందిగామ మండలం, సోమవరం గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. వరి, ప్రత్తి, మొక్కజొన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు. రైతుల సమస్యలను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే, నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్