పద్మశ్రీ అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ను మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాజేంద్రప్రసాద్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నటుడిగా ఆయన కళా ప్రస్థానంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.