జగ్గయ్యపేటలో గురువారం నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. కోదాడ రోడ్ మార్కెట్ యార్డ్ నుంచి నేషనల్ హైవే వరకు రోడ్ విస్తరణ పనుల్లో భాగంగా చెట్లను తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజ్ఞాన్ నగర్, మైహోమ్ రోడ్, కనపర్తి నగర్, డాలర్స్ కాలనీ, NSP కాలనీ, కోర్ట్, పుట్ట బజార్, శాంతినగర్, విష్ణు ప్రియా నగర్ వంటి ప్రాంతాలలో ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని ఏఈ ప్రమీల తెలిపారు.