జగ్గయ్యపేట మండలంలోని అనుమంచిపల్లిలో తల్లిదండ్రులు లేని తొమ్మిదో తరగతి విద్యార్థిని (14) ఒంటరితనాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. షేర్మహమ్మద్‌పటలో చదువుతున్న ఈ బాలిక, బంధువుల ఇంట్లో ఉంటూ గత రెండు రోజులుగా పాఠశాలకు వెళ్లడం లేదు. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బ్లేడుతో చేతులు కోసుకుని, ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.