ఎన్ హెచ్-65 నుంచి ముళ్లపాడు గ్రామం వరకు అధ్వానంగా మారిన రహదారికి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) కృషితో రూ.1 కోటి నిధులు మంజూరవడంతో మోక్షం లభించింది. హైవే నుంచి జిల్లా పరిషత్ హైస్కూల్ వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్డు (సింగిల్ లేయర్) నిర్మిస్తున్నారు. ఈ పనులతో వాహనదారుల దశాబ్దాల కష్టాలు తీరనున్నాయి.