బుధవారం రాత్రి జగ్గయ్యపేట మండలం గట్టు భీమవరం (చిల్లకల్లు) టోల్గేట్ వద్ద నందిగామ ఆర్డీవో ఆధ్వర్యంలో ప్రైవేట్ బస్సులపై విస్తృత తనిఖీలు జరిగాయి. ఇటీవల మార్కాపురం వద్ద జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆర్టీవో అధికారులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో స్థానిక పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు.