పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామంలో విజయవాడ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణ, ఏసిపి తిలక్, సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు ఎస్సై అర్జున్ మాట్లాడుతూ, డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలో అనేకమంది బాధితులవుతున్నారని తెలిపారు. రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది, గ్రామ ప్రజలు, పెద్దలు పాల్గొన్నారు.