కార్తీక మాసం మూడవ ఆదివారం సందర్భంగా పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారు ప్రకృతి సిద్ధమైన వివిధ రకాల పండ్లతో అలంకరించబడి భక్తులకు దర్శనమిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రక్షణ చర్యలు తీసుకున్నామని ఆలయ అధికారులు తెలిపారు.