పెనుగంచిప్రోలులో గురువారం మున్నేరు నదిలో ప్రవాహం భారీగా పెరిగింది. దీనితో ముందు జాగ్రత్త చర్యగా బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎమ్మార్వో శాంతిలక్ష్మీ, రెవెన్యూ, పోలీసు శాఖల సిబ్బంది, కూటమి నాయకులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని ఎమ్మార్వో తెలిపారు.