పని ఒత్తిడిని తట్టుకోలేక స్వర్ణ గ్రామంలో ఇద్దరు వార్డు ఉద్యోగులు మరణించడంతో, జగ్గయ్యపేటలో గురువారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వారికి సంతాపం తెలిపారు. అసోసియేషన్ నేతలు అన్నపూర్ణ చారి, ప్రభాకర్ రావు తదితరులు మృతులకు అశ్రునివాళి అర్పిస్తూ, నిరంతర ఒత్తిడితో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పని వేళలను క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేశారు.