వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను 13వ తేదీ ఉదయం 10 గంటలకు జగ్గయ్యపేటలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద వేలం వేస్తున్నట్లు ఎక్సైజ్ ఎస్సై గురవయ్య తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునేవారు రూ. 2 వేల ధరావత్తు చెల్లించి పాటలో పాల్గొనవచ్చు. వాహనాలు దక్కించుకున్నవారు మొత్తాన్ని 18 శాతం జీఎస్టీతో వెంటనే చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.