శనగపాడులో వర్షం.. విరిగిపడ్డ విద్యుత్ స్తంభం

4చూసినవారు
శనగపాడులో వర్షం.. విరిగిపడ్డ విద్యుత్ స్తంభం
పెనుగంచిప్రోలు మండలం శనగపాడులో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ గాలులకు రోడ్డుపై కరెంటు స్తంభం విరిగిపడటంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్థులు తెలిపారు. ఈ సంఘటనతో రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది.