జగ్గయ్యపేటలో రేషన్ బియ్యం స్వాధీనం

1చూసినవారు
జగ్గయ్యపేట-కోదాడ రోడ్డులో సోమవారం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన వ్యాన్‌లో స్థానిక వేర్హౌస్ గోడౌన్ నుంచి పాడైపోయిన బియ్యాన్ని మిల్లుకు తరలిస్తున్నట్లు డ్రైవర్ తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టినట్లు తహశీల్దార్ మనోహర్ తెలిపారు. నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు వేర్హౌస్ అధికారులను సంప్రదిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్