గురువారం సాయంత్రం రెడ్డిగూడెం మండల వ్యాప్తంగా కురిసిన వడగళ్ల వానతో వరి, మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేతికొచ్చిన పంటను కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడ్డారు. ప్రభుత్వం సకాలంలో పంటను కొనుగోలు చేసి ఉంటే ఇంతటి నష్టం జరిగేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి నష్టపోయిన తమ తడిసిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.