పెనుగంచిప్రోలులో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అనంతరం, మూడోరోజు వసంతోత్సవ వేడుకలను భక్తులు వైభవంగా నిర్వహిస్తున్నారు. చెరువుగట్టు బజారు రావిచెట్టు, బీసీ కాలనీ, తుఫాన్ కాలనీలలో ఏర్పాటు చేసిన స్వామివారి వసంత వేడుకలను భక్తులు ఆధ్యాత్మికంగా చేపట్టారు. విద్యుత్ దీపాలంకరణతో గ్రామోత్సవం నిర్వహించగా, పెద్దలు, పిల్లలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.