పెనుగంచిప్రోలులోని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం రాత్రి అర్చకులు పరాంకుశం సీతారామాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి గరుడ సేవతో పాటు విశేష పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. అధికమాసం, స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నరసింహ స్వామివారిని చందనంతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను కూడా ఆచరించారు.