జగ్గయ్యపేటలో పండగ రోజూ పన్నుల వసూలు

4చూసినవారు
జగ్గయ్యపేట పురపాలక సంఘంలో పన్నుల వసూళ్లు ఊపందుకున్నాయి. శ్రీరామనవమి పర్వదినం నాడు కార్యాలయం తెరిచి ఉంచగా, ఒక్కరోజే రూ. 5 లక్షల పన్ను వసూలైనట్లు కమిషనర్ టి. వి. కృష్ణారావు తెలిపారు. ఈ నెల 31 లోపు బకాయిలు చెల్లిస్తే అపరాధ రుసుముపై 50% రాయితీ ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శనివారం నుంచి మొండి బకాయిదారుల ఇళ్ల ముందు దండోరా వేయిస్తామని కమిషనర్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్