జగ్గయ్యపేట మండలంలోని తిరుమలగిరి గ్రామంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా, శ్రీ స్వామివారి దేవేరుల పవళింపు సేవను అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ద్వాదశ ప్రదక్షిణాలు చేయించారు. మహిళలకు అమ్మవారి శేష వస్త్రాలను, ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.