పెనుగంచిప్రోలు మున్నేరు బ్రిడ్జిపై రాకపోకలు పునఃప్రారంభం

5చూసినవారు
పెనుగంచిప్రోలులోని మున్నేరు బ్రిడ్జిపై వరద నీరు తగ్గుముఖం పట్టింది. గురువారం ఉదయం నుంచి ఉధృతంగా ప్రవహించిన వరద శుక్రవారం తెల్లవారుజాము నుంచి తగ్గింది. మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వరద తగ్గి బ్రిడ్జి కనిపించడంతో, అధికారులు బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సాగించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి బ్రిడ్జిపై రాకపోకలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్