జగ్గయ్యపేటలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు అయ్యప్ప నగర్ లోని అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి ఆర్యవైశ్య భక్తులు అమ్మవారికి 'సారె' సమర్పించడంతో వైభవంగా జరిగాయి. పసుపు, కుంకుమలు, పట్టు వస్త్రాలు, గాజులు, పూలతో కూడిన సారెను ప్రత్యేక వాహనంలో శోభాయాత్రగా తీసుకువెళ్లి అమ్మవారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తాతయ్య సతీమణి శ్రీదేవి, ఐవీఎఫ్ నాయకులు, ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.