వత్సవాయి: 589 మార్కులతో మెరిసిన శ్రావణి

0చూసినవారు
వత్సవాయి: 589 మార్కులతో మెరిసిన శ్రావణి
వత్సవాయి మండలం పోలంపల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో 95 శాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి పేరు తెచ్చారు. మొత్తం 36 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, వారిలో 33 మంది ఉత్తీర్ణులయ్యారు. పి. శ్రావణి 589 మార్కులతో మండలంలోనే ప్రథమ స్థానం సాధించి, తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ విజయంపై ప్రధానోపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్