
జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రేసులో శ్రీరామ్ చినబాబు?
జగ్గయ్యపేట పట్టణ రాజకీయాల్లో 2026 మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి తరఫున చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ తాతయ్య సోదరుడు శ్రీరామ్ చినబాబు బరిలోకి దిగుతారా అనే చర్చ జరుగుతోంది. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, టిడిపి అధిష్టానం జగ్గయ్యపేటలో బలమైన పట్టు సాధించాలనే ఉద్దేశంతో, ప్రజల మద్దతు, సేవాగుణం, చాణక్య దూరదృష్టి కలిగిన చినబాబును ముందుకు తేవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లోనూ తాతయ్య గారి విజయాలకు చినబాబు కీలక పాత్ర పోషించారు. యూత్‌లో ఆయనకు విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. లోకేష్ గారు కూడా గత నెలలో చినబాబును అభినందించి, ప్రత్యక్ష రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని సూచించినట్లు సమాచారం.






































