
తిరుపతమ్మ క్షేత్రంలో వైభవంగా అమ్మవారి భజన
పెనుగంచిప్రోలు మండల కేంద్రంలోని అమ్మవారి విడిది మండపం వద్ద సోమవారం సాయంత్రం శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దీక్షా స్వాముల ఆధ్వర్యంలో భజన కార్యక్రమం వైభవంగా జరిగింది. అర్చకులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో దీక్షా స్వాములు, భక్తులు పాల్గొన్నారు.


































