
జగ్గయ్యపేట: ఈ గ్రామాల మధ్య వాహనాలకు రాకపోకలకు అంతరాయం.
పెనుగంచిప్రోలు మండలం పరిధిలోని అనిగండ్లపాడు - గుమ్మడిదూరు గ్రామాల మధ్య రహదారి పక్కన ఉన్న కందకంలో లారీ ఇరుక్కుపోవడంతో పెద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా అటుగా వెళ్లే ఆర్టీసీ బస్సులు, స్కూల్ వాహనాలు మార్గమధ్యలోనే నిలిచిపోయాయి. లారీని తొలగిస్తేనే వాహనాల రాకపోకలు పునరుద్ధరించబడతాయని స్థానికులు తెలిపారు.






































