ఆటోలో ప్రయాణించిన సీపీ

1702చూసినవారు
ఆటోలో ప్రయాణించిన సీపీ
ప్రయాణికుల భద్రత కోసం ఎన్టీఆర్ జిల్లా పోలీసులు Ride Safety – QR Code Feedback Systemను ప్రారంభించారు. CP రాజశేఖర బాబు చేతుల మీదుగా సిటీ ఏఆర్ గ్రౌండ్‌లో ఆవిష్కరణ జరిగింది. CP సామాన్యుల ఆటోలో ప్రయాణించి భద్రత వివరించారు. ప్రతి ఆటోలో రెండు QR కోడ్‌లు ఏర్పాటు చేయగా, ప్రయాణికులు స్కాన్ చేసి డ్రైవర్ సేవలపై ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చు. మంచి సేవలందించే డ్రైవర్లను నెలనెలా సత్కరించనున్నారు.