కైకలూరు: సైబర్ మోసం నగదు రకవరీ

68చూసినవారు
కైకలూరు: సైబర్ మోసం నగదు రకవరీ
కైకలూరు మండలం తామరకొల్లుకి చెందిన ప్రత్తిపాటి శ్రీనివాసరావు ఇటీవల తన సెల్ ఫోన్ లో ఏపీకే ఫైలు రూపంలో వచ్చిన అనుమానాస్పద లింక్‌ ను ఓపెన్ చేశారు. దీంతో ఆయన బ్యాంక్ ఖాతా నుంచి మొత్తం రూ. 1,64,000 మోసపూరితంగా సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించగా సైబర్ క్రైమ్ విభాగం సమన్వయంతో సైబర్ నేరస్తుల నుండి నగదును రికవరీ చేసిన సొమ్మును సోమవారం బాధితుడికి ఎస్పీ ప్రతాప్ కిషోర్ అందజేశారు.

సంబంధిత పోస్ట్