Mar 19, 2026, 17:03 IST/
బిగ్ అప్‌డేట్.. 8వ వేతన సంఘం గడువు మార్చి 31 వరకు పొడిగింపు
Mar 19, 2026, 17:03 IST
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. 8వ వేతన సంఘానికి సంబంధించిన సూచనలు, అభిప్రాయాలు సమర్పించే గడువును మార్చి 31 పొడిగించారు. మొదట ఈ గడువు మార్చి 16తో ముగియాల్సి ఉండగా, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తితో మరింత సమయం ఇచ్చారు. మొత్తం 18 అంశాలతో కూడిన ప్రశ్నావళిపై MyGov వేదిక ద్వారా స్పందనలు అందించవచ్చు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, కనీస వేతనం, డీఏ, పెన్షన్ వంటి కీలక అంశాలపై అభిప్రాయాలు సేకరించనున్నారు. ఈ సూచనల ఆధారంగా భవిష్యత్ జీతాలు, పెన్షన్ మార్పులు నిర్ణయించే అవకాశం ఉంది.