Mar 13, 2026, 13:03 IST/
ఈ కప్పు మాది కాదు.. మనందరిదీ: సూర్యకుమార్ యాదవ్
Mar 13, 2026, 13:03 IST
టీ20 ప్రపంచకప్ గెలుపు నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో, 'మీ అందరి మద్దతు, దీవెనల వల్లే మేం ఇది సాధించాం. ఈ వరల్డ్ కప్ ట్రోఫీ కేవలం మా విజయం మాత్రమే కాదు, యావత్ భారత దేశ విజయం' అని ఆయన అన్నారు. ఈ విజయం భవిష్యత్తును ఊహించుకునే చిన్నారులదని, స్టేడియాల్లో పోటెత్తిన అభిమానులదని, తమకు మద్దతు తెలిపిన ఫ్యాన్స్ అందరిదని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.