
మచిలీపట్నం: జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డీఈవో
గురువారం మచిలీపట్నం కలెక్టరేట్లోని చాంబర్ నందు, నూతన డీఈవో యూవీ. సుబ్బారావు జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా డీఈవోగా విధులు నిర్వహిస్తున్న సుబ్బారావును ఇటీవల జరిగిన బదిలీల్లో కృష్ణాజిల్లా డీఈవోగా బదిలీ చేశారు. విద్యా వ్యాప్తికి కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన సూచించారు.






































