మంగినపూడి బీచ్ బుధవారం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. భక్తులు పెద్ద ఎత్తున సముద్రతీరానికి చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం "ఓం నమఃశివాయ" నినాదాలతో శివనామస్మరణ చేశారు. వేదమంత్రాలు చదువుతూ, సముద్రతీరంలో దీపాలు వెలిగించి మహా శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.