అమరావతి ఆంధ్రుల రాజధాని అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అమరావతికి చట్టబద్ధత బిల్లుపై లోక్‌సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు. రైతుల భూ త్యాగాలతోనే అమరావతి నిర్మాణం అవుతోందని చెప్పారు. వైసీపీ హయాంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొని మహిళలే ఉద్యమాన్ని నడిపించారని కొనియాడారు. రూపాయి ఖర్చు లేకుండా CM చంద్రబాబు వేల ఎకరాలను సమీకరించారని, రాష్ట్రాభివృద్ధిలో రాజధాని కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.