కంకిపాడు: అంగన్వాడీలు నిరసన ర్యాలీ

2చూసినవారు
కంకిపాడు: అంగన్వాడీలు నిరసన ర్యాలీ
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించలేని చేతకాని ప్రభుత్వం, అంగన్వాడీలను వేధించి, శిబిరాన్ని ధ్వంసం చేసి, అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అంగన్వాడి హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు లక్ష్మీ ప్రసన్న అన్నారు. మంగళవారం కంకిపాడులోని ఐసిడిఎస్ కార్యాలయం నుంచి కంకిపాడు బస్టాండ్ వరకు అంగన్వాడీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పట్టించుకోవడం లేదని, వారిని అణచివేసే ప్రయత్నం చేస్తోందని ఆమె ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్