జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ, దేశ రక్షణకు సరిహద్దుల్లో సైనికులు చేస్తున్న సేవలను కొనియాడారు. వారి సంక్షేమం కోసం నిధులు సమకూర్చడం అభినందనీయమన్నారు. సోమవారం, జిల్లా కలెక్టర్ మరియు మెప్మా పీడీ సాయిబాబు ఆధ్వర్యంలో పతాక దినోత్సవ నిధి కోసం దాతల నుండి సేకరించిన 6.65 లక్షల రూపాయల బ్యాంకు చెక్కును సైనిక సంక్షేమ శాఖకు అందజేశారు.