కృష్ణా జిల్లా పోలీసులకు లిఖిత ఇన్ఫ్రా లిమిటెడ్ అధినేత గడ్డిపాటి శ్రీనివాసరావు 9 నూతన వాహనాలను శనివారం సమకూర్చారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఐజీ అశోక్ కుమార్, ఎమ్మెల్యేలు మండలి బుద్దప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్ ఈ వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు కోటిన్నర రూపాయల వ్యయంతో ఈ వాహనాలను అందించిన గడ్డిపాటి శ్రీనివాసరావును పోలీస్ శాఖ ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేసింది.