మచిలీపట్నం పోలీస్ కార్యాలయంలో సోమవారం 'మీకోసం' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుందని తెలిపారు. ప్రజల నుంచి 37 అర్జీలను స్వయంగా స్వీకరించి, చట్టానికి లోబడి ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి అర్జీని పోలీసులు అధికారులు సత్వరమే పరిష్కరించాలని సూచించారు.