బందరు ఇన్‌చార్జ్ డీఎస్పీ ధర్మేంద్ర నగరంలోని అంబులెన్స్ డ్రైవర్లను అంబులెన్స్ సేవల విషయంలో హెచ్చరించారు. బుధవారం మచిలీపట్నంలోని తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో, రోగుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అంబులెన్స్ డ్రైవర్ల సేవలు ఉన్నతమైనవిగా ఉండాలని ఆయన సూచించారు.