ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాల్లో కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన యస్. సాయి ప్రవల్లిక డిప్యూటీ కలెక్టర్ కేడర్ పోస్ట్ కు ఎంపికైంది. స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన సత్యనారాయణ, పద్మల కుమార్తె అయిన ప్రవల్లిక, మచిలీపట్నంలోనే పాఠశాల, ఇంటర్మీడియట్ పూర్తి చేసి, బీ.టెక్ చదివింది. సివిల్స్ పై ఆసక్తితో రెండవ ప్రయత్నంలోనే ఆమె ఈ విజయం సాధించడం, కష్టపడి చదివితే ఏదైనా సాధ్యమేనని నిరూపించింది.