వచ్చే మే నెల ఒకటో తేదీ నుండి చేపట్టనున్న ఇండ్ల గణన కార్యక్రమాన్ని ఎలాంటి తప్పులు దొరలకుండా సజావుగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాలాజీ గణన చార్జ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఇండ్ల గణన జిల్లా చార్జ్ స్థాయి అధికారుల శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. ఎన్నికల మాదిరిగా ఈ ఇండ్ల గణన కార్యక్రమాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించి శ్రద్ధతో చేయాలన్నారు.