మచిలీపట్నం: వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు

0చూసినవారు
మచిలీపట్నం: వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు
మచిలీపట్నంలో మొదటిసారిగా బైండోవర్ అమలులో ఉండగా, మరొక కేసులో పాల్గొన్న తన్నేరు నాగరాజు అనే వ్యక్తిని రాబర్ట్ సన్ పేట పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారికి ఇది ఒక గుణపాఠమని మచిలీపట్నం డిఎస్పి జి. శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం న్యాయమూర్తి నాగరాజుకు ఆరు నెలల జైలు శిక్ష విధించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్