కృష్ణా జిల్లా పోలీసులు ఆదివారం వందమందికి పైగా క్రికెట్ బెట్టింగులు, పేకాట శిబిరాలు, కోడిపందాల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, గన్నవరంలో జిల్లా పోలీస్ యంత్రాంగం దాడులు చేపట్టింది. ముఖ్యంగా గుడివాడలోని టిడ్కో కాలనీ ప్రాంతంలో గతంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులు జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టించాయి.